హార్వార్డ్ బుర్రను అంచనా వేయడం సాధ్యమేనా?

నేడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలకు వణుకు పుట్టిస్తున్న పేరు డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.
ఒకప్పుడు డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక IPS ఆఫీసర్, అనంతరం పేద బిడ్డల జీవితాలను సమూలంగా మార్చాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అమెరికా లో నాడు చదివిన ప్రాఖ్యత విశ్వవిద్యాలయం హార్వర్డ్. ఈ యూనివర్సిటీ లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివి తన పోలీసు పదవిని పక్కన పెట్టి అప్పటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ గారి సహాయం తో గురుకుల గురువుగా అక్షరాలా 290 సాంఘిక, గిరిజన సంక్షేమ హాస్టల్స్ లో చదివే లక్షలాది బిడ్డలకు దిశా నేర్దేశకుడై
అణగారిన జీవితాల్లో నూతనోత్సాహం నింపి లక్షలాది పేద బిడ్డలు మేము ఎవ్వరికంటే తక్కువ కాదు మేము ఏదైనా సాధిస్తాం అంటూ దేశ విదేశాల్లో చదువుకునే అవకాశాలను అరి కాళ్ళ దగ్గర పెట్టగల్గిన గొప్ప అడ్మినిస్ట్రేషన్ తెలిసిన పవర్ ఫుల్ ఆఫీసర్ అతను.

పేద బిడ్డల ఉన్నత చదువులకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగి అడిగి అలసిపోయి ఈ పేద బిడ్డల జీవితాలను సమూలంగా మార్చాలి అంటే రాజ్యాధికారం తప్పనిసరి అని భావించి
తన ఏడున్నర సంవత్సరాల IPS పదవిని త్యాగం చేసి ఏవిధమైన ఉనికి లేని మహనీయుల ఆశయాలను మోసే బలమైన నాయకుడు లేక వెలిబోయిన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు.

వారికీ ఉన్న దీర్ఘద్రుష్టి అంతా ఇంత కాదు ఆ పార్టీలో చేరడం తో మిగతా రాజకీయ పార్టీలు ఈయన తో ఏమావుతుంది లే అనుకున్నారు.
కానీ అయన పదునైన భానాలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తల వంచక తప్పలేదు.
సచివాలయం లో బహుజన ఉద్యోగుల పదోన్నతి నుండి దళిత బంధు,లాంటి ఎన్నో పథకాలు కెసిఆర్ ఆయనకు బయపడి ప్రకటించాడు. అయన చరిష్మా ఎంత అంటే రాజ్యాంగాన్నే మార్చాలి అన్న కెసిఆర్ ని జై భీమ్ అనేలా చేసాడు.
దేశంలోనే అతి పెద్ద బాబాసాహెబ్ విగ్రహం పెట్టేలా చేసాడు.
ఇలా ప్రతీ సమస్య ను తన బుజస్కంధాలపై ఎత్తుకుని ప్రధాన రాజకీయ పార్టీలు సైతం హౌర అనిపించేలా ప్రజల గుండె చెప్పుడై నిలిచాడు.
ఆ హార్వర్డ్ బుర్ర లో పుట్టిన ఎన్నో ఆలోచనలను ఆచరణ లో పెట్టి జాతి గతి ని మార్చే వ్యూహం తో ముందుకు సాగుతున్నాడు..
వారు బహుజన్ సమాజ్ పార్టీల్లో చేరి నేటికీ రెండున్నర సంవత్సరాలు,ప్రతీ రోజు ఉదయం 5:00 గంటలకు నిద్ర లేసి 10 కిలోమీటర్లు వాకింగ్ చేసి ఉదయం 7:00 గంటలకు బయటకు వస్తే అర్ధరాత్రి 1:00 గంటల వరకు ప్రజల్లోనే ఉంటాడు.
సాధారణ కార్యకర్తలా ప్రజల బాగోగులు వింటూ వారికి కావాల్సిన అవసరాలు తీరుస్తూ వారి జీవితాల్లో శాశ్వత మార్పు కోసం నిరంతరం ఆలోచిస్తూ రకరకాల పథకాలను ప్లాన్ చేసి ప్రజల గుండెల్లో నిలుస్తున్నాడు.
అయన పథకాలు ఎలా ఉంటాయి అంటే 70 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సోనియా గాంధీ సైతం కాపీ కొట్టి కొడుకు రాహుల్ గాంధీ ద్వారా ప్రజలకు ప్రకటించేంతలా ఉంటాయి.

ఇది ఇలా ఉంటే గత 70 సంవత్సరాలనుండి కాంగ్రెస్, బీజేపీ,BRS లు ప్రజలకు చేస్తున్న మోసాన్ని ప్రజల దగ్గరికి వెళ్లి చెప్పడం వారిలో అంతర్గత మార్పు తేవడం అయన నైజం.
ఒక్కరూపాయి ఇవ్వకున్నా అర్థరాత్రి 12 గంటల వరకు అయన కోసం ప్రజలు ఎదిరిచుస్తారు అంటే అయన ఎంతటి జ్ఞాన యోధుడో అర్థం అవుతుంది.
జీరో నుండి పార్టీని నిర్ముస్తూ నేడు ఒక గొప్ప పార్టిగా మార్చగాలిగాడు,
పేపర్ ప్రకటనాల్లో, న్యూస్ లో కనిపించని పార్టీ పేరు ను సైతం పలకడం తప్పనిసరి చేసాడు.
రాబోయే ఎలక్షన్స్ లో బహుజన్ సమాజ్ పార్టీ తో పొత్తు లేకుంటే గెలువలేము అనే ఒక అనివార్యత సృష్టించాంగలిగాడు.
అందులో భాగమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఆదినాయకులు BSP తో మేము పొత్తు పెట్టుకుంటున్నాం అనే చెప్పేలా చేసింది.
ఏది ఏమైనా 119 నియోజకవర్గల్లో బలంగా పుంజుకున్న BSP అధికార ప్రతిపక్ష పార్టీల్లో వణుకు పుట్టిస్తుంది.
ప్రతీ నియోజకవర్గం లో దాదాపు 30% ఓట్లు రూపాయి పంచకున్న BSP కె పడనున్నట్లు సర్వే సంస్థలు చెబుతున్నాయి,
ఇక డబ్బులు పంచె నాయకులు పార్టీలోకి వొస్తే గెలుపు తథ్యం అని సర్వే సంస్థలు కితభిస్తున్నాయి.