హైదరాబాద్‌లో రూ.600కే వీక్లీ బస్‌ పాస్‌!

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్‌:
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్‌ఆర్టీసీ రూ.600తో వీక్లీ బస్‌ పాస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొనుగోలు చేసిన రోజు నుంచి వరుసగా ఏడు రోజులపాటు ఏసీ, నాన్‌ ఏసీ సిటీ బస్సుల్లో అపరిమితంగా ప్రయాణించవచ్చు. అయితే పుష్పక్‌ ఎయిర్‌పోర్ట్‌ లైనర్‌ బస్సులకు ఈ పాస్‌ వర్తించదు. పర్యాటకులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలకు ఈ సదుపాయం ఉపయోగకరంగా ఉంటుంది. నగరంలోని సిటీ బస్‌ పాస్‌ కౌంటర్లలో పాస్‌లను కొనుగోలు చేయవచ్చని సంస్థ తెలిపింది.

You may also like...