ఓటు చోర్–దేశ్ బచావో ప్రచారానికి టీపీసీసీ సమన్వయకర్తల నియామకం
- ఓటు చోర్–దేశ్ బచావో ప్రచారానికి టీపీసీసీ సమన్వయకర్తల నియామకం - October 22, 2026
- నీళ్లున్నా రైతులకు కరువేనా? రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంపై ప్రవీణ్ కుమార్ ధ్వజం! - October 22, 2026
- బతుకమ్మ వేడుకల్లో దాడి .. బాధితులకు అండగా మందకృష్ణ మాదిగ! - October 22, 2026

- రాష్ట్రవ్యాప్తంగా 10 మంది టీపీసీసీ సమన్వయకర్తలను నియమిస్తూ ఉత్తర్వులు
- ఉత్తర్వులు జారీ చేసిన టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్ కుమార్ గౌడ్
- రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల బాధ్యతలు అఫ్సర్ యూసుఫ్ జాహికి అప్పగింత
- ఏఐసీసీ పరిశీలకులతో సమన్వయం చేసుకుంటూ ప్రచారం నిర్వహణ
- అక్టోబర్ 19 నుంచి నియామకాలు తక్షణమే అమల్లోకి
హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఓటు హక్కుల పరిరక్షణ, ఓటరు జాబితాల్లో అవకతవకలపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘ఓట్ బచావో–దేశ్ బచావో’ ప్రచారాన్ని తెలంగాణలో మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు టీపీసీసీ సమన్వయకర్తలను నియమించింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్ కుమార్ గౌడ్ అక్టోబర్ 19, 2026న అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు ఏఐసీసీ పరిశీలకులను కేటాయించడంతోపాటు, వారితో సమన్వయం చేసుకుంటూ ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు పది మంది టీపీసీసీ సమన్వయకర్తలకు బాధ్యతలు అప్పగించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు రామడుగు శ్రవణ్ రావు, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు కూన శ్రీశైలం గౌడ్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు గాలి అనిల్ కుమార్, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలకు ఎన్. ప్రీతమ్, హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాలకు కొప్పుల ప్రవీణ్ కుమార్ సమన్వయకర్తలుగా నియమితులయ్యారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల బాధ్యతలను అఫ్సర్ యూసుఫ్ జాహికి అప్పగించారు. వనపర్తి, నారాయణపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, గద్వాల జిల్లాలకు రాచమల్ల సిద్ధేశ్వర్, నల్గొండ, భువనగిరి, సూర్యాపేట జిల్లాలకు ఎం.ఆర్.జి. వినోద్ రెడ్డి, హనుమకొండ, వరంగల్, ములుగు, జనగాం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు అరికెల నర్సారెడ్డి, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు దుద్దిళ్ల శ్రీను బాబు సమన్వయకర్తలుగా నియమితులయ్యారు. ఆయా జిల్లాల్లో ఏఐసీసీ పరిశీలకులతో కలిసి ప్రచారాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం, పార్టీ కార్యక్రమాల అమలును సమర్థవంతంగా పర్యవేక్షించడం సమన్వయకర్తల ప్రధాన బాధ్యతగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని టీపీసీసీ అధ్యక్షుడు స్పష్టం చేశారు.
