పొద్దుటూరు గ్రామంలో ఘనంగా పండగల సాయన్న జయంతి వేడుకలు


జ్ఞానతెలంగాణ, వెబ్ డెస్క్,శంకర్‌పల్లి:
పొద్దుటూరు గ్రామంలో పండగల సాయన్న జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండ లక్ష్మీ నరసింహ, ఉపసర్పంచ్ కావేలి గోవర్ధన్ రెడ్డి, శంకర్‌పల్లి పీఏసీఎస్‌ చైర్మన్ బొల్లారం వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ కటిక శ్రీనివాస్, వార్డు సభ్యులు ఏనుగు నరేందర్ రెడ్డి, కోటి ప్రశాంత్, ఉమ్మెత్తల శ్వేత, వినోద్ కుమార్, నట్టల అనిత, రమేష్, కావేలి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. గ్రామ పెద్దలు కావేలి జంగారెడ్డి, పులకండ్ల రఘుపతి రెడ్డితో పాటు గ్రామ యువకులు, ముదిరాజ్ సంఘం సభ్యులు, గ్రామస్తులు భారీ సంఖ్యలో హాజరై జయంతి వేడుకలను విజయవంతం చేశారు.

You may also like...