ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే కసిరెడ్డి
- ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే కసిరెడ్డి - October 22, 2026
- వినయ్ కుటుంబానికి బీఆర్ఎస్ నాయకుల రూ.20 వేల ఆర్థిక సాయం - October 22, 2026
- బుద్ధుని బోధనలపై అవగాహన.. వేలంలో బుద్ధుని ప్రతిమను సొంతం చేసుకున్న..ప్రవీణ్ పోలె - October 22, 2026

వెల్దండ:దసరా పండుగ సందర్భంగా జరిగిన వివిధ ప్రమాదాల్లో గాయపడిన వారిని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పరామర్శించారు.రఘుపతిపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు,బొల్లంపల్లి గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రమాదాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆసుపత్రికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.ఈ కార్యక్రమంలో వెల్దండ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, బొల్లంపల్లి సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్,ఉప సర్పంచ్ రామకృష్ణ, నాయకులు కొయ్యల పుల్లయ్య, కొమ్ము రవి తదితరులు పాల్గొన్నారు.
