భక్తి శ్రద్ధలతో ఘనంగా  దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు



జ్ఞాన తెలంగాణ ప్రతినిధి మోమిన్ పేట్ మండలం అక్టోబర్ 21:


మోమిన్ పేట్ మండలం పరిధిలోని చీమలదరి గ్రామంలో  జై గణేష్ యూత్ అసోసియేషన్  ఆధ్వర్యంలో  దసరా నవరాత్రి వేడుకల  బాగంగా  దుర్గామాత నిమజ్జన వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గ్రామస్తులు, మహిళలు , యువకులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. డప్పుచప్పుళ్ళు, భక్తి గీతాల మధ్య ,డీజే పాటలతో, నృత్య ప్రదర్శన తో అంగరంగా  వైభవంగా  శోభాయాత్ర  నిర్వహించారు.  ఈ కనువిందు చూడడానికి భక్తులు తరలి వచ్చారు భక్తుల భక్తిశ్రద్ధలతో కొలిచిన తొమ్మిది రోజుల నవరాత్రి వేడుకల అనంతరం  జగన్మాత దుర్గామాత నిమజ్జన మహోత్సవం అత్యంత వైభవంగా, కనుల పండువగా నిర్వహించబడింది. భక్తుల జయధ్వానాలు, మంగళవాయిద్యాల హోరు, డప్పు చప్పుళ్ల నడుమ అమ్మవారి శోభాయాత్ర అత్యంత శోభాయమానంగా సాగింది.  గ్రామంలో   వీధులన్నీ అమ్మవారి నామస్మరణతో మార్మోగాయి.
ఉదయం నుంచే భక్తులు అమ్మవారి మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, కన్నీటి వీడ్కోలు పలికారు. “తరలిరావమ్మా దుర్గాదేవి… మళ్లీ రావమ్మా” అంటూ భక్తులు భావుకతతో నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు కుంభాలతో వచ్చి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి, మంగళహారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు.  భక్తులు అధిక సంఖ్యలో  పాల్గొని విజయవంతం చేశారు.

You may also like...