కేఎస్ రత్నంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీసీ సంక్షేమ సంఘం నేత బండమీది వెంకటేష్
- మరికొద్ది క్షణాల్లో టంగుటూరుకు మందకృష్ణ మాదిగ - October 15, 2026
- దేవుల నాయక్కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి జన్మదిన శుభాకాంక్షలు - October 12, 2026
- పెళ్లి హామీతో లైంగిక వేధింపుల ఆరోపణ.. డీఐ బాలస్వామి అరెస్ట్! - October 11, 2026

చేవెళ్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం చేవెళ్ల నియోజకవర్గం అధ్యక్షులు బండమీది వెంకటేష్ హాజరై కేఎస్ రత్నంకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్ఛం అందజేశారు. కేఎస్ రత్నం ప్రజా జీవితంలో మరింత చురుకుగా కొనసాగుతూ ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని బండమీది వెంకటేష్ కోరుకున్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కేఎస్ రత్నంకు శుభాకాంక్షలు తెలిపారు.
