ఇప్పుడున్నది అచ్చ కాంగ్రెస్ కాదు.. పచ్చ కాంగ్రెస్ కాదు.. లుచ్చ కాంగ్రెస్:కేటీఆర్ ధ్వజం
- తెలంగాణ టెట్ హాల్ టికెట్స్ విడుదల - September 2, 2026
- కేఎస్ రత్నంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీసీ సంక్షేమ సంఘం నేత బండమీది వెంకటేష్ - September 2, 2026
- కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల విఫల పాలనపై బీఆర్‌ఎస్ నిరసన - September 2, 2026

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అచ్చ కాంగ్రెస్ కాదు.. పచ్చ కాంగ్రెస్ కాదు.. లుచ్చ కాంగ్రెస్ అంటూ ఘాటైన పదజాలంతో విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పాలనను గాలికొదిలేశారని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారం కంటే పదవుల కోసం కుమ్ములాటలు, ఆధిపత్య పోరాటాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు. అధికార పక్షంలోనే అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నా ప్రజల కష్టాలపై దృష్టి పెట్టేవారు కరువయ్యారని విమర్శించారు. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం కనిపించడం లేదని, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని కేటీఆర్ అన్నారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ఈ పాలనకు భవిష్యత్తులో ప్రజలే గట్టి బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
