జీవితాన్ని వెలుగులోకి నడిపేది శుభ ఆలోచనే
- సీతక్కకు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఘాటు ప్రశ్న - August 31, 2026
- కామ పిశాచి కిరాతకం - August 31, 2026
- గద్వాల మార్కెట్ యార్డులో భారీగా గంజాయి పట్టివేత..! - August 31, 2026

జీవితాన్ని వెలుగులోకి నడిపేది శుభ ఆలోచనే
యమకవగ్గో
మనోపుబ్బంగమా ధమ్మా
మనోసెట్ట్ఠా మనోమయా।
మనసా చె పసన్నేన
భాసతి వా కరోతి వా।
తతో నం సుఖమన్వేతి
ఛాయావ అనపాయినీ॥
మన ఆలోచనలే మన జీవితానికి మూలం. నిర్మలమైన, ప్రశాంతమైన మనస్సుతో మాట్లాడినా, పనిచేసినా సుఖం ఎప్పటికీ విడిచిపోని నీడలా మన వెంట నడుస్తుంది.
మూలం: ధమ్మపదం – యమకవగ్గో, గాథ 4.
మనిషి జీవితం బయట పరిస్థితుల వల్ల మాత్రమే సుఖంగా మారదు. నిర్మలమైన మనస్సు, మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష వంటి కుశల భావాలే నిజమైన ఆనందానికి పునాది. స్వచ్ఛమైన మనస్సుతో పలికే మాట, చేసే పని తనకూ ఇతరులకూ మేలు చేస్తుంది. అలాంటి జీవితం శాంతిని, విశ్వాసాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తుంది.
ఈ రోజు మీ మనస్సులో మైత్రిని పెంపొందించండి. కోపానికి బదులుగా సహనాన్ని, ద్వేషానికి బదులుగా కరుణను, అసూయకు బదులుగా ముదితను, స్వార్థానికి బదులుగా దానశీలాన్ని ఆచరించండి. నిర్మలమైన మనస్సు నుంచి పుట్టిన ప్రతి ఆలోచన సుఖమయమైన జీవితానికి మార్గం వేస్తుంది.
“ఎప్పటికీ విడిచిపోని నీడ మన వెంట నడిచినట్లే, నిర్మలమైన మనస్సుతో చేసిన మంచి పనుల ఫలితం కూడా మనిషిని ఎల్లప్పుడూ అనుసరిస్తుంది.”
✍️ అరియ నాగసేన బోధి
– M.A., M.Phil., TPT., LL.B.
ధమ్మ సమణో
