భారత రాజ్యాంగం ఒక పవిత్ర గ్రంథం
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

భారత రాజ్యాంగం ఒక పవిత్ర గ్రంథం
జ్ఞాన తెలంగాణ,షాబాద్,నవంబర్ 27:
షాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ…ఆధునిక భారత రాజ్యాంగ రూపశిల్పి,రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవిష్యత్ అవసరాలను ముందుగానే అంచనా వేసి ఆధునిక కాలానికి అవసరమైన, కాలానుగుణమైనటువంటి సవరణలకు,మార్పు చేర్పులకు అనుకూలమైన ఆధునిక భారత రాజ్యాంగాన్ని రూపొందించి, అందులో ముఖ్యంగా భారత పౌరులు పొందే హక్కులు,వారు చేయవలసిన విధులు, అనుసరించవలసిన ఆదేశిక సూత్రాలను పొందుపరచడం జరిగిందని,రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల వలన నేడు బడుగు, బలహీన,పేద విద్యార్థులు స్వేచ్ఛగా విద్యను అర్జించడం జరుగుతుందని, మహిళలు ఉద్యోగ, వ్యాపార,రాజకీయ రంగాలలో పురుషులతో సమానంగా రాణించగలుగుతున్నారని, విభిన్న సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన భారతదేశంలో అనేక కులాలు,మతాలు ఉన్నప్పటికిని భారత పౌరులు అందరు స్వేచ్ఛ, సమానత్వం,సోదర భావంతో కలిసిమెలిసి జీవించగలుగుతున్నారని,రాజ్యాంగ ప్రవేశికలోని అంశాలను వివరించి, భారత రాజ్యాంగ ఒక పవిత్ర గ్రంథమని, మనందరం దానిని గౌరవించాలని,రాజ్యాంగం మన భవిష్యత్ దిక్సూచి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం చైర్మన్ విజయ్ కుమార్, జడల రాజేందర్ గౌడ్, తమ్మలి రవీందర్,నర్సింలు గౌడ్, తొంట వెంకటేష్, రాపోలు నర్సింలు, వెంకటేష్,రాజు, కేతన రమేష్ యాదవ్, దండు రాహుల్, రాము,మురళి, చందు, రాజు, తదితర నాయకులు పాల్గొన్నారు.
