సేవను జీవన విధానంగా మార్చుకున్న ప్రేరణాత్మక వ్యక్తిత్వం
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్‌పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

జ్ఞానతెలంగాణ, హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో సేవా పథాన్ని జీవన ధ్యేయంగా మార్చుకున్న ప్రముఖ సామాజిక కార్యకర్త బాలప్రసాద్ జన్మదినం ఈరోజు ప్రత్యేకతను సంతరించుకుంది. డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సార్ స్ఫూర్తితో ప్రజాసేవను దినచర్యగా మార్చుకున్న బాలప్రసాద్, స్వేరోస్ వైస్–చైర్మన్‌గా ఎన్నో మందికి మార్గదర్శకుడయ్యారు. గ్రామీణ యువతలో కొత్త ఆత్మవిశ్వాసం నింపుతూ, ముఖ్యంగా పల్లె విద్యార్థులను సాఫ్ట్‌వేర్ రంగాల్లోకి దారితీరు చూపించి వారి భవిష్యత్తుకు కొత్త దారులు తెరిచారు.
కరోనా మహమ్మారి సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర పరిస్థితుల్లో ముందుండి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఆహారం నుంచి వైద్యం వరకు, ఆక్సిజన్ నుంచి అత్యవసర చికిత్సల వరకూ సహాయం అందించి అనేక కుటుంబాలకు ప్రాణాధారంగా నిలిచారు. వరదలు, ప్రమాదాలు, అత్యవసర సందర్భాల్లో కూడా అదే నిబద్ధతతో సేవ చేస్తూ ప్రజల్లో విశ్వాసాన్ని పొందారు. సేవ అవసరమైన ప్రతి చోట హాజరవుతూ, చేతులు చాచి సహాయం చేయాలనే తపన ఆయన వ్యక్తిత్వానికి ప్రతీక.
ఎన్జీవో ద్వారా పేద కుటుంబాలకు, అవసరమైన వారికి నిరంతర చేయూత అందిస్తూ, సామాజిక సేవను ఒక అపరిమిత యాత్రగా మార్చుకున్నారు. ఎంత ఎదిగినా తన రూట్‌ను మరిచిపోకుండా, సేవలోనే తన అడుగులు వేస్తూ చూపుతున్న వినయం, నాయకత్వం, నిజాయితీ యువతకు నిలువెత్తు స్ఫూర్తి.
