ఊకల్‌లో శ్రీ నాగేంద్ర సుబ్రహ్మణ్య స్వామి దర్శించిన కేటీఆర్
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్,నవంబర్ 26:
వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఊకల్ ప్రాంతంలోని శ్రీ నాగేంద్ర సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని కేటీఆర్ సందర్శించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు పురోహితులు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. ఆలయ పరిసరాలను పరిశీలించి అభివృద్ధి పనుల గురించి సమాచారాన్ని తెలుసుకున్నారు. స్థానికులు, భక్తులు ఆయనను చూసేందుకు భారీగా తరలివచ్చారు.
