రోడ్డుపై మహిళ ప్రసవం
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గురువారం సావాతిగూడ గ్రామానికి చెందిన సీడాం మార్కు బాయి అనే గిరిజన మహిళ తీవ్ర పురిటి నొప్పులతో బాధపడుతుండగా, గ్రామానికి సరైన రోడ్డు లేకపోవడంతో 108 అంబులెన్స్ వెళ్ళలేకపోయింది. కుటుంబ సభ్యులు ఆమెను మూడు కిలోమీటర్లు నడిపించుకుంటూ అంబులెన్స్ వద్దకు తీసుకెళ్తుండగా, మార్గమధ్యంలోనే ఆమె రోడ్డుపైనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉండటంతో వారిని మెరుగైన వైద్యం కోసం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంపై ఆందోళన వ్యక్తం అయ్యింది.
