టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోహన్ రావు ను సన్మానించిన తెరాస నాయకులు

టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోహన్ రావు ను సన్మానించిన తెరాస నాయకులు


ఇటీవలన నూతనంగా ఎంపికైన శంషాబాద్ మండలం టిఆర్ఎస్ అధ్యక్షులు మోహన్ రావు ను బిఆర్ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండల పరిధిలోని బుధవారం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మాచర్ల మోహన్ రావు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు గూడెపు అశోక్ హరికృష్ణ నాయకులు రమేష్ తదితరులు మంచిర్ల మోహన్రావుని కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్ద కాలంలో టిఆర్ఎస్ పార్టీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని రాష్ట్రంలో సబ్బండ వర్గాలకు అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ ప్రభంజనం మ్రో గిస్తుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »