బేగంపేట్ :తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు కూన వెంకటేష్ గౌడ్
- మరికొద్ది క్షణాల్లో టంగుటూరుకు మందకృష్ణ మాదిగ - October 15, 2026
- దేవుల నాయక్కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి జన్మదిన శుభాకాంక్షలు - October 12, 2026
- పెళ్లి హామీతో లైంగిక వేధింపుల ఆరోపణ.. డీఐ బాలస్వామి అరెస్ట్! - October 11, 2026

బేగంపేట్ :తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు కూన వెంకటేష్ గౌడ్
(67) శుక్రవారం రాత్రి మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా, సికింద్రాబాద్, సనత్‌నగర్ నియోజకవర్గాల నుంచి తెదేపా అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెదేపా బీసీ సెల్ అధ్యక్షుడిగా పని చేశారు. ఆ తరువాత ఆయన భారాసలో చేరారు. ఇటీవల తిరిగి తెదేపాలోకి వచ్చారు. కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఇంటి వద్దనే ఉంటున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కూన వెంకటేష్ గౌడ్ అంత్యక్రియలు ఆయన స్వస్థలం గాజులరామారంలో శనివారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
