రాచకొండ కమిషనర్ గా సుధీర్ బాబు నియామకం
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్‌పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

రాచకొండ కమిషనర్ గా సుధీర్ బాబు నియామకం
మా జ్ఞానతెలంగాణ,హైదరాబాద్, జులై 11:హైదరాబాద్: రాచకొండ పోలీస్ బాస్ మళ్లీ మారారు. 2001 బ్యాచ్‌కు చెందిన జి.సుధీర్‌బాబును నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బాధ్యతలు చేపట్టిన తరుణ్జోషిని బదిలీ చేసిన ప్రభుత్వం మళ్లీ జి.సుధీర్‌బాబుకు బాధ్యతలు అప్పగించింది. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం డిసెంబరు రెండోవారంలో రాచకొండ కమిషనర్‌గా సుధీర్‌బాబును నియమించింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి రెండోవారంలో ప్రభుత్వం సుధీర్‌బాబును బదిలీ చేసి తరుణ్‌జోషికి బాధ్యతలు అప్పగించింది. ఇటీవల ఎన్నికలు ముగియడంతో మళ్లీ సుధీర్‌బాబుకు బాధ్యతలు అప్పగించింది. ఉత్తర్వులు వెలువడ్డ కొద్ది గంటల్లోనే సుధీర్‌బాబు నేరేడ్‌మెట్‌లోని కమిషనరేట్‌లో బాధ్యతలు చేపట్టారు.
