హ్యాపీ ప్లే స్కూల్ అమ్మ ఒడి అంగన్ వాడి

హ్యాపీ ప్లే స్కూల్ అమ్మ ఒడి అంగన్ వాడి
తెలంగాణ కొడకండ్ల తేదీ: 1106-2024. ఈరోజు కొడకండ్ల మండల కేంద్రంలోని రెండు అంగన్ వాడి సెంటర్లు కలిసి ప్లే స్కూల్ ఏజీ వచ్చిన పిల్లల కోసం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ప్లే స్కూల్లో చిన్న పిల్లలకు ఎల్కేజీ మరియు యూకేజీ, నర్సరీ మొదలైనటువంటి ఇంగ్లీష్ మీడియం కోర్సును ప్రారంభించుటకై గడపగడపకు తిరిగి ప్రచారం చేసి ప్లే స్కూలు కోసం వచ్చే పిల్లలను నమోదు చేయడం జరిగింది. ఈనాటి ఈ కార్యక్రమానికి హాజరైన హరిజన కాలనీ హెడ్మాస్టర్ ప్రభాకర్, అంగన్వాడీ టీచర్లు శివరాత్రి వినోద, అందే నరసమ్మ. మరియు పిల్లలు వారి తల్లిదండ్రులు మొదలగు వారు పాల్గొనడం జరిగింది.
