ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీపీ రడపాక సుదర్శన్ .

ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీపీ రడపాక సుదర్శన్ .
జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్:
సార్వత్రిక ఎన్నికల సందర్బంగా ఎంపీపీ రడపాక సుదర్శన్ గారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జఫర్గడ్ మండలం తమ్మడపల్లి (ఐ) గ్రామంలో పాఠశాలలో పార్టీ నాయకులు తో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అనంతరం మాట్లాడుతూ….
రాష్ట్ర ప్రజలందరూ విధిగా తమ ఓటు హక్కును వినియోంచుకోవాలని కోరారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు విచక్షణతో అలోచించి అవినీతి రహిత పాలన అందించే వారికీ మీ అమూల్యమైన ఓటు వేయాలని తెలిపారు. భారత దేశ ప్రజా స్వామ్యాన్ని కాపాడుకోవలన్న, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలన్న, రాబోయే రోజులలో భవిష్యత్ బాగుండాలన్న ప్రజలు, యువకులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.