Category: తాజా వార్తలు

సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులు

జ్ఞాన తెలంగాణ, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశ అత్యున్నత న్యాయస్థానానికి ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసుల మేరకు జస్టిస్‌ సునీత అగర్వాల్‌, జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ దేవేంద్రకుమార్‌ ఉపాధ్యాయలను...

టొరంటో వర్సిటీ భారీ స్కాలర్‌షిప్

విదేశాల్లో పీహెచ్‌డీ చేయాలనుకునే ప్రతిభావంతులైన విద్యార్థులకు కెనడాలోని టొరంటో విశ్వవిద్యాలయం భారీ అవకాశాన్ని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా పరిశోధనా ప్రతిభను ఆకర్షించే లక్ష్యంతో ‘ప్రెసిడెంట్స్‌ ఇంపాక్ట్‌ స్కాలర్‌షిప్స్‌’ పేరుతో 100 మిలియన్‌ కెనడియన్‌ డాలర్ల (దాదాపు రూ.956 కోట్లు) నిధులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎంపికైన ఒక్కో పీహెచ్‌డీ...

విశాఖలో సముద్ర రక్షణకు మరింత బలం

జ్ఞాన తెలంగాణ,నేషనల్ బ్యూరో : రక్షణ రంగంలో స్వదేశీ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్)లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఫ్లీట్ సపోర్ట్ షిప్-1 (ఎఫ్ఎస్ఎస్-1)ను లాంఛనంగా జలప్రవేశం చేయించారు....

గడ్డం వెంకటస్వామి ఆశయాలకు ఘన నివాళి

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్,అక్టోబర్ 5:దివంగత గడ్డం వెంకటస్వామి 97వ జయంతి సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు. పేదలు, కార్మికులు, అణగారిన వర్గాల హక్కుల కోసం గడ్డం వెంకటస్వామి చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ప్రజా సేవలో...

మహాలక్ష్మికి పెరుగుతున్న ఆదరణ..3 నెలల్లో 97.20 లక్షల అదనపు ప్రయాణాలు

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్‌: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న మహాలక్ష్మి పథకం రాష్ట్ర ప్రజా రవాణా వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది. ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్న మహిళల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో టీజీఎస్‌ఆర్టీసీపై ప్రయాణికుల రద్దీ భారం కూడా గణనీయంగా పెరుగుతోంది. గతేడాదితో...

ఓటుకు నోటు కేసులో స్టీఫెన్‌సన్‌ పిటిషన్

జ్ఞాన తెలంగాణ,న్యూఢిల్లీ: 2015 నాటి ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న నామినేటెడ్ మాజీ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్‌సన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసులో తనను ఇంప్లీడ్‌ చేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. తన వాదనలను కూడా కోర్టు...

ఉద్యోగులు,పింఛన్‌దారులకు నగదు రహిత వైద్యం

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రవేశపెట్టిన ‘న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్’ (ఈహెచ్‌ఎస్) అమలు వేగం పుంజుకుంది. ఈ పథకాన్ని నిర్వహిస్తున్న ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్‌సీటీ) ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక...

ఎస్‌ఐఆర్‌పై ప్రతిపక్షాల ప్రచారం తప్పుదారి పట్టించేదే: రామచందర్‌రావు

హైదరాబాద్,వెబ్ డెస్క్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు విమర్శించారు. ఎస్‌ఐఆర్‌ అనేది బీజేపీ చేపట్టిన కార్యక్రమం కాదని, భారత ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన అధికారాలతో నిర్వహిస్తున్న ఎన్నికల...

భీమ్‌గల్ పోలీస్‌స్టేషన్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

జ్ఞాన తెలంగాణ,వెబ్ డెస్క్ : నిజామాబాద్ జిల్లాలోని భీమ్‌గల్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. భీమ్‌గల్‌లో హోటల్ నిర్వహిస్తున్న సుధాకర్ పోలీస్‌స్టేషన్‌లోనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నట్లు సమాచారం. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో తొలుత ఆర్మూర్ ఆసుపత్రికి...

నేడు బీజేపీ రాష్ట్ర పదాధికారుల కీలక భేటీ

జ్ఞానతెలంగాణ,వెబ్ డెస్క్: తెలంగాణ బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం నేడు జరగనుంది. రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అధ్యక్షతన నిర్వహించనున్న ఈ సమావేశానికి ఉదయం 11 గంటలకు ముఖ్యఅతిథిగా అభయ్ పాటిల్ హాజరుకానున్నారు. పార్టీ రాష్ట్ర పదాధికారులు, ముఖ్య నేతలు సమావేశంలో పాల్గొననున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో...