మరో గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 26 మంది విద్యార్థులు అస్వస్థత
- మరో గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 26 మంది విద్యార్థులు అస్వస్థత - July 9, 2026
- శంషాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మహిళలు దుర్మరణం - July 9, 2026
- రూ.2,000 నోట్లపై ఆర్బీఐ తాజా ప్రకటన - July 9, 2026
జ్ఞాన తెలంగాణ, అమ్రాబాద్:
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులోని ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలలో గురువారం ఫుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుకుంది. ఉదయం అల్పాహారం తీసుకున్న అనంతరం 26 మంది విద్యార్థులు వాంతులు, వికారం, కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే విద్యార్థులను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలో అందిస్తున్న ఆహారం నాణ్యతపై, పరిశుభ్రతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాగునీరు కూడా సరిగా అందించడం లేదని, పలుమార్లు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
గురుకుల పాఠశాలల్లో వరుసగా ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యత, పరిశుభ్రత, తాగునీటి సౌకర్యాలపై సంబంధిత అధికారులు వెంటనే సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

