నిజాంసాగర్ పెద్ద కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

- నసురుల్లాబాద్ ఎస్సై రాఘవేంద్ర
జ్ఞాన తెలంగాణ, బాన్సువాడ ప్రతినిధి,ఏప్రిల్ 06 :
నసురుల్లాబాద్ మండలంలోని మిర్జాపూర్ గ్రామ శివారులో గల నిజాంసాగర్ 25 డిస్ట్రిబ్యూటర్ కాలువలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సుమారు 60 సంవత్సరాల వయస్సు గల వృద్ధ మహిళ మృతదేహం నీటిలో తేలుతూ కనిపించినట్లు మండల ఎస్సై రాఘవేంద్ర తెలిపారు. మృతురాలు వయస్సు సుమారు 60 సంవత్సరాలు ఉండవచ్చని తెలిపారు. ఆమె కాషాయ ఆకుపచ్చ రంగు గల చీర ధరించి ఉండగా తల వెంట్రుకలు నలుపు తెలుపు రంగులో ఉన్నట్లు ఆయన వివరించారు. మృతురాలి వివరాలు అని ఎవరైనా గుర్తుపట్టగలిగితే నసురుల్లాబాద్ పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని కోరారు. సంబంధిత సమాచారం కలిగిన వారు ఈ నంబర్కు 87126 86174 ను సంప్రదించాలని కోరారు
