హామీల కోసం పోరాటం -ముందస్తు అరెస్టులతో ఉద్రిక్తత

హామీల కోసం పోరాటం -ముందస్తు అరెస్టులతో ఉద్రిక్తత
- మాజీ సర్పంచ్‌ల బిల్లుల మంజూరు డిమాండ్
- తెలంగాణ ఉద్యమకారుల హామీలు నెరవేర్చాలని ఆందోళన
- చలో అసెంబ్లీ ముట్టడి పిలుపుతో ఉద్రిక్తత
- నవాబ్‌పేట్‌లో ముందస్తు పోలీస్ చర్యలు
- ఉద్యమకారులను స్టేషన్‌కు తరలింపు
జ్ఞానతెలంగాణ, నవాబ్ పేట్ ప్రతినిధి :
చలో అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో నవాబ్‌పేట్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సర్పంచ్‌లకు గతంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు వెంటనే మంజూరు చేయాలని మాజీ సర్పంచ్‌లు కృష్ణరెడ్డి, ప్రకాశం, అంజయ్యలు డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ ఉద్యమ కారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు తక్షణమే నెరవేర్చాలని ఉద్యమకారులు జైపాల్ రెడ్డి, గణపురం శాంతి కుమార్ పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో చలో అసెంబ్లీ ముట్టడిని అడ్డుకునేందుకు నవాబ్‌పేట్ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఉద్యమకారులు ఆందోళనకు సిద్ధమవుతున్న సమయంలో జైపాల్ రెడ్డి, గణపురం శాంతి కుమార్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపులో ఉంచేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
