15వ వార్డు అభ్యర్థి బొమ్మన బోయిన సుజాత వెంకన్న గెలుపు కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజేందర్ ఇంటింటా ప్రచారం

జ్ఞాన తెలంగాణ, తొర్రూర్ ప్రతినిధి :
ఈనెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకొని పట్టణ కేంద్రానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త బొమ్మన బోయిన రాజేందర్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తొర్రూర్ మున్సిపల్ 15వ వార్డు అభ్యర్థిని బొమ్మన బోయిన సుజాత వెంకన్న గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆదివారం ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార పార్టీని గెలిపిస్తే అన్ని విధాల వార్డు అభివృద్ధి చెందుతుందని వార్డులో ఉన్న డ్రైనేజీల సమస్య రోడ్ల సమస్యలు తాగునీరు సమస్య, వీధి దీపాలు, వీధి స్తంభాలు అలాగే ఇందిరమ్మ ఇల్లు తీసుకొచ్చి ప్రతి ఒక్క అర్హులైన నిరుపేదలకు అందిస్తామని, మౌలిక సదు పాయాల మెరుగుదల కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు .కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ని ఆదరించి దీవించి ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరిని వేడుకున్నారు..ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జ్ మేకల కుమార్, బానోత్ విద్యాసాగర్, వెంకట్ రెడ్డి, రమేష్, వల్లపు యాకయ్య,ఎర్రం రాజు, ఏనుగంటి శేఖర్, మందపురి శ్రీధర్, అజ్మీరా రమేష్, బానోత్ వీరన్న , బానోత్ సోమన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మహిళలు యువకులు పాల్గొన్నారు
