ఇస్నాపూర్ మున్సిపాలిటీ 23వ వార్డ్‌లో బీఎస్పీ అభ్యర్థి బోడపట్ల నర్సింగరావు జోరుగా ప్రచారం


– అభివృద్ధి, ప్రజా సంక్షేమమే నా ప్రధాన అజెండా
– ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ చేరేలా కృషి
– వార్డు సమస్యలకు దశలవారీ పరిష్కారం
– యువతకు ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి
– ఏనుగు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి


జ్ఞాన తెలంగాణ, పటాన్ చెరు, ఫిబ్రవరి 6

ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డ్‌లో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) కౌన్సిలర్ అభ్యర్థిగా బోడపట్ల నర్సింగరావు ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు. ఇంటింటి ప్రచారం, వీధివీధి సమావేశాల ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ ఓటర్లకు చేరువవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 23వ వార్డ్ అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమమే తన రాజకీయ అజెండా అని స్పష్టం చేశారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తానని హామీ ఇస్తూ, డ్రైనేజీ, రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం, వీధిదీపాలు వంటి మౌలిక వసతుల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని దశలవారీగా పరిష్కరిస్తానన్నారు. అలాగే వార్డులోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఉద్యోగాల రూపకల్పన, శిక్షణ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటూ, వార్డ్ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే కౌన్సిలర్‌గా పనిచేస్తానని భరోసా ఇస్తూ, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీకి చెందిన ఏనుగు గుర్తుపై ఓటు వేసి తనను 23వ వార్డ్ కౌన్సిలర్‌గా గెలిపించాలని ప్రతి ఒక్క ఓటరును పేరుపేరునా విజ్ఞప్తి చేశారు.

You may also like...

Translate »