బాధిత కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేత

- కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కన్నా సోమశేఖర్
జ్ఞాన తెలంగాణ,జఫర్‌గడ్ :
జఫర్‌గడ్ మండల కేంద్రానికి చెందిన బొజ్జు స్వామి ఇటీవల హార్ట్ స్ట్రోక్‌తో మృతి చెందగా, ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కన్నా సోమశేఖర్ పరామర్శించారు. స్థానిక శాసనసభ్యులు కడియం శ్రీహరి ఆదేశాల మేరకు, అలాగే కాంగ్రెస్ నాయకుడు మంచాల ఎల్లయ్య సూచనలతో స్వామి కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా సోమశేఖర్ మాట్లాడుతూ, నిరుపేద కుటుంబమైన బొజ్జు స్వామి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని అన్నారు. కష్టకాలంలో పార్టీ నాయకులు బాధిత కుటుంబాల పక్కన నిలవడం కాంగ్రెస్ సంప్రదాయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఇల్లందుల స్రవంతి మొగిలి, మార్కెట్ డైరెక్టర్ ఇల్లందుల బాబు, మండల నాయకులు కుల్ల రాజు, తోట రమేష్, వార్డు మెంబర్ ఇల్లందుల రాధిక, ఎల్లస్వామి, నంచర్ల కోటి, సముద్రాల నర్సయ్య, రాములు రాజు తదితరులు పాల్గొన్నారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచిన నాయకులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
