ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో రైతు వారోత్సవ కార్యక్రమం

  • హాజరైన జిల్లా వ్యవసాయ అధికారి ఉష
  • షాబాద్ మండల వ్యవసాయ అధికారి విజయచంద్ర ఆధ్వర్యంలో నిర్వహణ

జ్ఞాన తెలంగాణ,షాబాద్, మే 07:

షాబాద్ మండల కేంద్రంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ,విద్యుత్ శాఖల సమక్షంలో షాబాద్ మండల వ్యవసాయ అధికారి దండెం విజయచంద్ర ఆధ్వర్యంలో రైతు వారోత్సవం కార్యక్రమాన్ని గురువారం ఉదయం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా జిల్లా వ్యవసాయ అధికారి ఉష, సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పీసరి సురేందర్ రెడ్డి,గుడి మల్కాపూర్ మార్కెట్ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో అన్ని శాఖల వారు సంయుక్తంగా కలిసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు.వ్యవసాయ క్షేత్రాల ప్రదర్శన,సౌర విద్యుత్ కేంద్రాలు, పిఎం – కుసుమ్,వ్యవసాయ యాత్రీకరణ- డ్రోన్స్ స్టాల్స్, వ్యవసాయ ట్రాక్టర్ పనిముట్లు,పవర్ ప్రేయర్స్, స్ట్రా బేలర్, ఇతర వ్యవసాయ పరికరాల ప్రదర్శన చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారిని ఉషా, జిల్లా ఉద్యానవన, సెరికల్చర్ అధికారి సురేష్, కృషి విజ్ఞాన కేంద్రం మెట్ట వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డా. శ్రీ కృష్ణ,షాబాద్ సర్పంచ్ అశోక్,నాగర్ గూడ సర్పంచ్ స్వాతి మహేందర్ గౌడ్, సంకెపల్లి గూడెం సర్పంచ్ లావణ్య చెన్నయ్య, మల్లారెడ్డిగూడ సర్పంచ్ సభిత గోవర్ధన్ రెడ్డి, కొమరబండ సర్పంచ్ పద్మమ్మ గోపాల్, వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులు, ఎలక్ట్రిసిటీ ఏఈ జీవి కోటేశ్వరరావు,ఐ ఎఫ్ ఎఫ్ సి ఓ కంపెనీ జిల్లా సేల్స్ ఆఫీసర్ సాయి కృష్ణ,వ్యవసాయ విస్తరణ అధికారులు శివతేజ, రాజేశ్వరి, గీత, గాయత్రి, మౌనిక,లిఖిత, మండలంలోని వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, వివిధ గ్రామల రైతు సోదరులు, మండలంలోని ఎరువులు, పురుగుమందుల,విత్తన డీలర్లు, మాధవ రెడ్డి,నరేందర్ రెడ్డి,హాజిజ్, మల్లారెడ్డి, నరసింహారెడ్డి, విజయ రెడ్డి, ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ సి ఇ ఓ చంద్రశేఖర్ రెడ్డి, డ్రోన్ ఆపరేటర్ యాదగిరి గౌడ్, సభ్యులు, ప్రజా ప్రతినిధులు, రైతులు హాజరయ్యారు.

You may also like...

Translate »