షాబాద్ మండలంలో చైన్ స్నాచింగ్ కలకలం

జ్ఞాన తెలంగాణ,షాబాద్,మే 07 :

షాబాద్ మండలంలోని మద్దూరు గేటు వద్ద మహిళ మెడలోని మంగళ సూత్రం ను గుర్తు తెలియని దుండగులు అపహరించిన ఘటన కలకలం రేపింది. షాబాద్ సిఐ కాంతా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… బుగ్గోని గూడ గ్రామనికి చెందిన భారతమ్మ రోడ్డుపై వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు ఆమె మెడలోని మంగళ సూత్రం ను లాక్కొని పరారయ్యారు.ఈ ఘటనతో మహిళ భయాందోళనకు గురైంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

You may also like...

Translate »