ప్రజలను మూర్ఖులుగా చేయడంలో ప్రభుత్వమే అగ్ర గణ్యం. దేశంలో ఆధ్యాత్మిక ప్రచారానికి ఎన్నో సంస్థలు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. మత సంబంధిత ప్రార్థనా స్థలాలు, చెవులు చిల్లులు పడేలా, రోగులు హార్ట్ ఎటాక్ తో చనిపోయేటట్టు, పాఠశాలల విద్యా బోధన సరి అయిన రీతిలో జరగకపోవడం లాంటి వన్నీ కూడా మతాల కార్యక్రమాల వల్లనే అడ్డంకులు ఏర్పడుతున్న వి.
పూర్వీకుల నుండి, వేల ఏళ్ల నాటి నుండి పరంపరగా వస్తున్న దైవ భావన, స్వర్గ నరకాల ఉనికి ఆత్మల స్వైర విహారం తో ప్రజలు ఇప్పటికే మూఢత్వంలో, మత మూర్ఖత్వంలో తమ జీవితాలను ఫణంగా పెట్టి అతి దుర్భరంగా గడుపుతున్నారు. దానికి తోడు ప్రభుత్వాలు ప్రజల సెంటిమెంట్లను అసరాగా చేసుకుని ప్రజల్లో పలుకుబడి సంపాదించుట కోసం, పదవులు కాపాడుట కోసం ఎన్నికల్లో గెలవడానికి ప్రజలు నమ్మిన అబద్ధాలను కూడా ఉాతమిచ్చి నిజాలుగా ప్రచారం చేస్తున్నారు. వారిని మూర్ఖత్వం నుండి అజ్ఞానం నుండి బయటపడేయడానికి బదులుగా దేవుడు ఉన్నాడని పూజలు యజ్ఞాలు యాగాలు పుష్కరాలు ప్రతి పండుగ జరుపుకోవడానికి అబద్దాల కథలల్లి ప్రచారం చేస్తూ నానాటికి ప్రజల ధనమాన ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వీధి వీధికి మత ప్రార్థన స్థలాలను కట్టి అన్నింటికీ ఆ దేవుడే కర్తయని మన జీవితాన్ని నడిపించేవాడు దేవుడే అని నమ్మడానికి అనేక కార్యక్రమాలు స్వయంగా ప్రజల డబ్బులతో ప్రభుత్వాలే నిర్వహిస్తున్నాయి.
జాతరకు పుష్కరాలకు ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా ప్రభుత్వమే పోలీసు వారిని శాంతి భద్రతల కోసం వినియోగిస్తున్నారు. ఎంతగా పోలీసు వారిని నియమించినను జనం ఎక్కువైన చోట ఏదో ఒక దుస్సంఘటన జరుగుతూనే ఉంది. తాజాగా కుంభమేళా సందర్భంగా తొక్కిసలాట జరిగి వందల ప్రాణాలు గాల్లో కలిసినవి. వేలాదిమంది క్షతగాత్రులయ్యారు. మొన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో కుంభమేళా నుండి ఇంటికి బయలుదేరిన మినీ బస్సును ట్రక్కు ఢీకొని ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. గతంలో పుష్కరాలలో కూడా తొక్కిసలాటలో 40 మంది వరకు చనిపోయిన సందర్భాలు ఇంతవరకు మనం విన్నాం. మతం అంటే హితంగా ఉండాలి అందరికీ సమ్మతంగా ఉండాలి. మతాన్ని తమ వ్యక్తిగతంగా పాటించాలి. సామూహికంగా పాటిస్తే ఇలాంటి సంఘటనలే జరుగుతుంటాయి. ఇటువంటి స్థలాల్లో ప్రాణాలు వదిలితే సరాసరి స్వర్గానికే వెళ్తామన్న పిచ్చి ఊహల్లో కొందరు ఉంటారు. దేవుడికి ఏటేటా పెళ్లి చేస్తారు.ఆ పెళ్లికి కావాల్సిన పట్టుబట్టలు మిగతా వస్తువులన్నీ కూడా ప్రభుత్వం వారి తరఫున ముఖ్యమంత్రి కానీ ఇతర మంత్రులు ఎవరైనా అక్కడ సమర్పించి వస్తుంటారు.అట్టి ఉత్సవాల్లో ఎమ్మెల్యేలు మంత్రులు పాల్గొంటారు. వారు పాల్గొనడం చూసి సాధారణ ప్రజానీకం కూడా వారిని అనుసరిస్తూ వెళ్తుంటారు.
దైవ దర్శనానికి వెళ్తుండగా ప్రమాదాలు సంభవించి ఎందరో ప్రాణాలు వదులుతారు. అక్కడ జరిగిన తొక్కేసలాటలో మరణిస్తారు. వచ్చేటప్పుడు కూడా ప్రమాదాలు జరిగి మరణిస్తుంటారు అయితే ప్రజలు ఒక విషయాన్ని గమనించడం లేదు. వెళ్ళేది దేవుని దగ్గరికి, వస్తున్నది దైవ దర్శనం చేసుకుని అటువంటి వారికి ఆపదాలు రావడం ఏమిటి? తన భక్తులకు ఆపద వస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? తన భక్తులనే కాపాడుకోలేని దేవుడు ఇతరులు అయ్యా దేవుడా? అనగానే ఎలా కాపాడుతాడు. ఈ చిన్న విషయాన్ని కూడా ప్రజలు గమనించలేకపోతున్నారు. ఇలా ప్రశ్నిస్తే కర్మ సిద్ధాంతం వల్లిస్తుంటారు.
ప్రభుత్వాలు ప్రభుత్వాల తరఫున అనేక యజ్ఞ, యాగాదులు చేస్తుంటారు రాజశ్యామల యాగం, చండీయాగం, సుదర్శన యాగం ఇలాంటివన్నీ ఎన్నో ప్రభుత్వాల తరపున కూడా నిర్వహిస్తుంటారు.
ప్రజలు కూడా దేవుని కోసం ఎంతైనా ఖర్చు పెడతారు ఎన్ని కిలోమీటర్లైనా నడిచి వెళ్తారు ఆరోగ్యం సహకరించకున్నను, బలవంతంగా నైనా కాళ్ళీడ్చుకుంటూ వెళ్తుంటారు. ప్రాథమిక అవసరములు తీరకున్నను కని,పెంచిన బిడ్డలకు తిండి గుడ్డలు లేకున్నను దేవుడు అనగానే పరిగెత్తుతుంటారు. దేవుళ్ళ దగ్గర,గుడుల దగ్గర ప్రార్థన స్థలాల దగ్గర అమ్మకానికి పెట్టిన వస్తువులు అధిక ధరలకు విక్రయిస్తుంటారు. అయినను ప్రజలు ధరలు లెక్క చేయక దేవుని దగ్గర వస్తువులు కదా? అని తీసుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్న చెట్లకు ముడుపులు కడతారు వారి పని సఫలం అవుతే మళ్ళీ వస్తామని మొక్కుకుంటారు పని జరిగిన తర్వాత మళ్లీ వచ్చి మొక్కు తీర్చుకుంటారు. మన భారతదేశ ప్రజల మెదళ్లలో దేవుడు అనే పదార్థం గట్టిపడి గడ్డకట్టుకుపోయింది. దేవుడు ఉన్నాడా ?లేడా ?అని ఏ ఆలోచన లేకుండా పక్కింటి వారు పోతుంటే, ఎదురింటి వారు ప్రయాణం అవుతుంటే,మేమేం తక్కువ తిన్నామా? అన్నట్టు పొలోమని పరిగెడుతుంటారు. మన దేశ ప్రజలలో ఆలోచన కన్నా అనుసరణ ఎక్కువ. అందుకోసం ఎదురింటి వారు వెళ్లారు కదా అని వారు తయారైపోతుంటారు. ప్రజలకు స్వీయ ఆలోచన లేదు. విశ్లేషించే సామర్థ్యం లేదు. కనీసం ఆలోచన చేయడానికి అయినా ప్రయత్నించరు. లాజిక్కులను అర్థం చేసుకోరు ఒకసారి నమ్మిన తర్వాత వారిని గుడ్డిగా నమ్ముతుంటారు. వారు ఏది చెప్తే అది చేస్తుంటారు. ఇదే పిచ్చి నమ్మకం అంటారు. నమ్మకం ఉండాలి కానీ ఒక విషయాన్ని ప్రశ్నించి, విశ్లేషించి నిజమైతేనే నమ్మాలి. లేకుంటే నమ్మకూడదని ఇంగిత జ్ఞానం ప్రజల దగ్గర లేదు.

ప్రభుత్వాలకు ప్రజలు ఎంత అజ్ఞానంలో ఉంటే అంత లాభం. ఎంత తెలియని తనం ఉంటే అంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఏది చెప్పినా తలలూపేవారు అంటేనే ప్రభుత్వాలకి ఇష్టం. ఎందుకంటే తమ దోపిడీ యదేచ్ఛగా సాగించవచ్చని వారి ఆలోచన. పైకి మాత్రం ప్రజలను ఆదుకున్నట్టుగా ప్రజా సంక్షేమానికి కట్టుబడినట్లుగా ప్రజల కోసమే తాము పరిపాలిస్తున్నామన్నట్టుగా నమ్మబల్కుతారు.
అబద్దాలను కూడా అందంగా చెబుతారు అలవికాని హామీలు ఇస్తుంటారు. ఎన్నికల్లో గెలవగానే వాటిని మర్చిపోతుంటారు. ప్రభుత్వాలే మతాలను గుడ్డిగా నమ్మి, దేవుళ్లను పూజలతో, యజ్ఞాలతో యాగాలతో ప్రార్థిస్తూ ఉంటే ప్రజాధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెడుతుంటే, ఇక అడిగే వారెవరు? ఈ దేశంలో ఒక సంవత్సరంలో ఇలాంటి వాటికి పెట్టే ఖర్చు ప్రజల కోసం వినియోగిస్తే ఇల్లు లేని వారు ఎవరూ ఉండరు ఐదు సంవత్సరాలు ఖర్చు పెడితే పేదవారని వారు ఎవరూ ఉండరు. ఈ విషయాన్ని ప్రభుత్వాలు తెలుసుకోవాలి కానీ ప్రజల గుడ్డి నమ్మకాలను కూడా ప్రభుత్వాలు ప్రోత్సహిస్తుంటాయి.
గుడి కట్టడం చాలా తేలిక. బడి కట్టడం ఎన్నటికీ సాధ్యపడదు ప్రజలు గుడి అంటే తన దగ్గర లేకున్నను అప్పులు చేసి మరీ చందాలిస్తుంటారు. బడిలో వసతులు లేవంటే కనీసం మూత్రశాలలు లేవన్నా కూడా ప్రజలు స్పందించరు. ఈ దారుణమైన విషయం మనదేశంలోనే ఉంది. విదేశాల్లో ప్రజలు దేవుడిని, గుడిని పక్కన పెట్టి వైజ్ఞానిక ఆలోచనలు చేసి ఎంతో అభివృద్ధి సాధిస్తున్నారు.నూతన ఆవిష్కరణలు చేపడుతున్నారు. కానీ మన దేశం మతము, గుడులు, గోపురాలు పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు పుష్కరాలు అనుకుంటూ అదే మత మూఢత్వంలో బతుకుతున్నాం. ఇంకా మనం మతము పూజలు యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటే విదేశాల సరసన చేరాలంటే మరో వందేళ్ళకు కూడా సాధ్యపడదు.ప్రజల సెంటిమెంట్ లతో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి.
విదేశాల్లో కనుగొన్న కొత్త విషయాన్ని మనకు చేరాలంటే మనకి ఇవ్వాలంటే కనీసం 20 ఏళ్ళు అయినా పడుతుంది 20 ఏళ్లలో మరో ఎన్నో కొత్త విషయాలు కనిపెడుతుంటారు విదేశీయులు. దీనిని మనం అందిపుచ్చుకునే ఉంది లోగా ఇంకెంతో ముందుకు పోతుంది విదేశీ సాంకేతికత.
మన భారతదేశం రోజు రోజుకి మూఢనమ్మకాల సుడిగుండంలో మత మూఢత్వంలో, మత మూర్ఖత్వంలో విల విల్లాడుతున్నది. పాలకులు వైజ్ఞానిక కార్యక్రమాల బదులు మత కార్యక్రమాల యందు ఎక్కువగా దృష్టి నిలుపుతున్నారు. ఇది ఎంత మాత్రమూ సమంజసం కాదు అభివృద్ధికి ఇది సహకరించదు వైజ్ఞానికంగా అభివృద్ధి చెందాలంటే మొదట ప్రభుత్వాలు కుల రహిత, మతరహిత ప్రభుత్వాలు కావాలి. సైన్స్ సాంకేతికతలను అందిపుచ్చుకోవాలి, చరిత్రతో పాటు, మానవతా విలువలతోపాటు, సైన్స్ సాంకేతికతను అభివృద్ధి పరచాలి. అప్పుడే మన దేశం విదేశీయుల సరసన చేరుతాము…….