మెరిట్‌తోనే 984 పోస్టుల భర్తీ

  • సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
  • వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య వర్సిటీల్లో నియామకాలు
  • రాతపరీక్ష మెరిట్‌కే ప్రాధాన్యం
  • ఇంటర్వ్యూలను పూర్తిగా రద్దు
  • పారదర్శక నియామక ప్రక్రియకు ప్రభుత్వం కట్టుబాటు

జ్ఞానతెలంగాణ,వెబ్ డెస్క్ ప్రతినిధి ,హైదరాబాద్ :
తెలంగాణలోని వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 984 పోస్టులను పూర్తిస్థాయి పారదర్శకతతో భర్తీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నియామక ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు, వివాదాలకు తావులేకుండా కేవలం రాతపరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. గతంలో అమలులో ఉన్న మౌఖిక పరీక్షల (ఇంటర్వ్యూల) విధానాన్ని ఈసారి పూర్తిగా రద్దు చేసి, నియామకాలను నిష్పక్షపాతంగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రతిభకు మాత్రమే ప్రాధాన్యం కల్పిస్తూ అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా నియామకాలపై పారదర్శకత పెరగడంతో పాటు యువతలో విశ్వాసం మరింత బలోపేతం అవుతుందని ప్రభుత్వం పేర్కొంది.

You may also like...