భార్య వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్త ఆత్మహత్య
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

భార్య వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్త ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం అందనాలపాడు తండాలో విషాద ఘటన చోటుచేసుకుంది. భార్య వివాహేతర సంబంధం కారణంగా మనస్థాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం తండాకు చెందిన ధరమ్ సోప్ సురేష్‌కు ఏడాది క్రితం అనితతో వివాహం జరిగింది. అయితే అనితకు ఇంటి ఎదురుగా నివసిస్తున్న సాయి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ విషయంపై పలుమార్లు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ భార్య ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సురేష్ చివరకు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి శ్రీను ఆరోపించారు.
సురేష్ మృతికి అదే తండాకు చెందిన సాయి కారణమంటూ కుటుంబ సభ్యులు మరియు బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో తండాలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
తన కుమారుడి ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి తండ్రి శ్రీను పోలీసులను కోరారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
