టెలిగ్రామ్‌కు మళ్లీ కేంద్ర ప్రభుత్వ నోటీసులు
- అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే - July 4, 2026
- ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుకు ఈసీ బ్రేక్.. - July 4, 2026
- బద్రీనాథ్ ఆలయ కానుకలపై అక్రమాల ఆరోపణలు - July 4, 2026

పైరసీ ఆరోపణల నేపథ్యంలో చర్యలు
న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్‌కు కేంద్ర ప్రభుత్వం మరోసారి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఇతర కాపీరైట్ కలిగిన డిజిటల్ కంటెంట్‌ను అక్రమంగా పంచుతున్న ఛానళ్లు, గ్రూపులపై చర్యలు తీసుకోవడంలో వైఫల్యం ఉందన్న పైరసీ ఆరోపణల నేపథ్యంలో ఈ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది.
కాపీరైట్ ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదులపై టెలిగ్రామ్ తీసుకుంటున్న చర్యలు, అక్రమ కంటెంట్ తొలగింపు విధానం, చట్టాలకు అనుగుణంగా సంస్థ అనుసరిస్తున్న ప్రక్రియపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కోరినట్లు సమాచారం. డిజిటల్ వేదికలపై పైరసీని అరికట్టేందుకు ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.
