మోదీ మరో దౌత్య వైఫల్యమే

- మాలో ఒకరిపై దాడి చేస్తే మా ఇద్దరిపై చేసినట్టే
- పాక్-సౌదీ మధ్య ‘నాటో’ తరహా రక్షణ ఒప్పందం
- ఖతార్‌లో ఇటీవల జరిగిన ముస్లిం దేశాల భేటీలో
- ‘ఇస్లామిక్ నాటో’ ఏర్పాటుకు పలు దేశాల ఒత్తిడి
- ఆ భేటీ జరిగిన 2 రోజులకే పాక్-సౌదీ ఒప్పందం
- మన దేశంపై కలిగేప్రభావాలను పరిశీలిస్తున్నాం: భారత్
- ఇది మోదీ మరో దౌత్య వైఫల్యమే.. కాంగ్రెస్ విమర్శలు
- పాక్-సౌదీ మధ్య ‘నాటో’ తరహా రక్షణ ఒప్పందం
నాటో దేశాల్లో ఏ దేశంపై అయినా దాడి జరిగితే.. అది తమ కూటమి మొత్తంపై జరిగిన దాడిగా భావించి నాటో దేశాలు దాని రక్షణకు ముందుకు వస్తాయి! ‘వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం’ పేరిట.. అదే తరహా ఒప్పందాన్ని ఇప్పుడు పాకిస్థాన్- సౌదీ అరేబియా కుదుర్చుకున్నాయి. దాని ప్రకారం.. ఆ రెండు దేశా ల్లో ఏ దేశంపై ఇతర దేశాలు దాడికి దిగినా రెండూ కలిసి యుద్ధం చేస్తాయి. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రియాద్ పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. షెహబాజ్ షరీఫ్- సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ దీనిపై సంతకం చేశారు. ఆ సమయంలో పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిఫ్ మునీర్, పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్, రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ అక్కడే ఉన్నారు. అనంతరం ఇరుదేశాలూ కలిసి దీనిపై ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని విస్తరించడం, తమ రెండు దేశాల్లో ఏ దేశంపై దాడి జరిగినా ఉమ్మడిగా ఎదుర్కోవడమే ఈ ఒప్పందం ఉద్దేశమని ఆ ప్రకటనలో పేర్కొన్నాయి. కాగా.. పాక్-సౌదీ నడుమ ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న చర్చల ఫలితమే ఈ ఒప్పందం అని సౌదీ అరేబియాకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఒప్పందం.. ఇటీవలికాలంలో జరిగిన ఎలాంటి ఘర్షణకూ ప్రతిస్పందన కాదని ఆయన పేర్కొన్నారు