ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన బుద్ధి చెబుతాం.

ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన బుద్ధి చెబుతాం.
ఫోటో. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు.
జ్ఞాన తెలంగాణ – బోధన్
ఎంపీ ధర్మపురి అరవింద్ నోటికి వచ్చినట్లు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించే ప్రసక్తి ఉండదని, లేనియెడల తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని కౌన్సిలర్ తూము శరత్ రెడ్డి పిసిసి డెలిగేట్ గంగ శంకర్ హెచ్చరించారు. గురువారం బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కౌన్సిలర్ తూము షరతి రెడ్డి డిసిసి డెలిగేట్ గంగ శంకర్ మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ ఓట్ల పుణ్యంతో ఎంపీ ధర్మపురి అరవింద్ గెలుపొందారని ఆయన గెలుపు అసలు గెలుపే కాదని అది ఓటమికి నాంది అని వారు ఎద్దేవా చేశారు .
చిన్నా పెద్ద తేడా లేకుండా నోటికి వచ్చినట్లు అహంకారంగా మాట్లాడడం తగ్గించుకోవాలని వారు హెచ్చరించారు. ఎన్నికలలో బిజెపి కార్యకర్తలు ఆయనకు సహకరించక పోవడంతో టిఆర్ఎస్ పార్టీ సహకారంతో గెలిచారని అన్నారు .
ఎన్నికల ప్రచారంలో తనను చూసి కాకుండా ప్రధాని మోడీని చూసి ఓటేయలని అడిగారని గుర్తు చేశారు. గత ఐదు సంవత్సరాలుగా ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ బోధన్ నియోజకవర్గాన్ని కానీ జిల్లాను కానీ ఏమీ అభివృద్ధి చేయలేదని, మళ్లీ ఈ ఐదు సంవత్సరాలు కూడా ఆయన ఏమి చేయలేరని విమర్శించారు. సుదర్శన్ రెడ్డి మంత్రిగా ఉన్న కాలంలో జలయజ్ఞం పథకంలో ఎన్నో పనులను చేశారని అన్నారు.
బోధన్ పట్టణంలో గల 56 ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసి ఎందరికో ఉపాధి కల్పించారని అన్నారు. గత పది సంవత్సరాల కాలంలో గాడి తప్పిన విద్య వ్యవస్థను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రతి పాఠశాలను అభివృద్ధి చేస్తూ విద్యార్థులకు కావలసిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ విద్య వ్యవస్థను బలపితం చేస్తున్నారని అన్నారు.
మరోసారి ఎంపీ అరవింద్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనవసరంగా విమర్శించిన బోధన్ లో తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో సీనియర్ నాయకులు పాషా మొహినోద్దీన్, హరికాంత్ చారి ,గౌసోద్దీన్, ఆనంపల్లి ఎల్లయ్య, విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.