విద్యార్థులకు కారంతో అన్నం..
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

- మంచిర్యాల ప్రభుత్వ పాఠశాలలో దారుణం
- సరిపడా భోజనం లేక ఆకలితో అలమటించిన విద్యార్థులు
మంచిర్యాల: జిల్లాలోని చెన్నూర్ ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు సరిపడా భోజనం అందించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆహారం సిద్ధం చేయకపోవడంతో పలువురు విద్యార్థులు కేవలం కారంతో అన్నం తిని ఆకలి తీర్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
విద్యార్థులకు పోషకాహారం అందించాల్సిన విద్యాసంస్థలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం పట్ల తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పూర్తి స్థాయి భోజనం అందకపోవడంతో ఆకలికి తట్టుకోలేక విద్యార్థులు కారంతోనే అన్నం తింటున్న దృశ్యాలు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.
ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహార భోజనం అందిస్తామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు ఈ ఘటనపై స్పందించి వాస్తవాలను వెలికితీయాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
