జులై 6 న గురుకుల ఇంటర్ స్పాట్ అడ్మిషన్స్..కౌన్సిలింగ్ సెంటర్ల వివరాలు ఇదిగో

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్:
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సంఘం (TGSWREIS) ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం రేపు (జూలై 6) జిల్లా కేంద్రాల్లో స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించనున్నారు. ఇప్పటికే రెండు విడతల ప్రవేశ ప్రక్రియ పూర్తయినప్పటికీ, వివిధ గురుకుల జూనియర్ కళాశాలల్లో మిగిలి ఉన్న ఖాళీ సీట్లను ఈ స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత సాధించిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
స్పాట్ అడ్మిషన్స్‌కు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా తమ ఒరిజినల్ మార్కుల మెమోలు, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (TC), కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలు, ఆధార్ కార్డుతో పాటు ఇతర అవసరమైన పత్రాలను వెంట తీసుకురావాలి. సీట్ల లభ్యత ఆధారంగా జిల్లా స్థాయిలోనే ప్రవేశాలు కల్పించనున్నారు. నాణ్యమైన విద్యతో పాటు ఉచిత వసతి, భోజనం, పాఠ్యపుస్తకాలు, పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ, డిజిటల్ విద్య వంటి అనేక సౌకర్యాలు గురుకుల కళాశాలల్లో అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.
స్పాట్ అడ్మిషన్స్‌కు సంబంధించిన జిల్లాల వారీ కేంద్రాల పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. విద్యార్థులు తమ జిల్లాకు సంబంధించిన కేంద్రంలో నిర్ణీత సమయానికి హాజరై ప్రవేశ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు. అవసరమైన ధ్రువపత్రాలు లేకుంటే ప్రవేశం కల్పించడం సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేశారు. ఆలస్యం చేయకుండా రేపే సంబంధిత స్పాట్ అడ్మిషన్ కేంద్రానికి చేరుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ప్రత్యేక కౌన్సిలింగ్ ద్వారా రాష్ట్రంలోని గురుకుల జూనియర్ కళాశాలల్లో మిగిలిన ఖాళీ సీట్లన్నింటినీ భర్తీ చేయాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సంఘం లక్ష్యంగా పెట్టుకుంది. తదుపరి ప్రవేశాలపై ప్రత్యేక అవకాశం ఉండకపోవచ్చని అధికారులు పేర్కొనడంతో అర్హులైన విద్యార్థులు నిర్లక్ష్యం చేయకుండా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.

కౌన్సిలింగ్ సెంటర్ల వివరాలు ఇదిగో :-

You may also like...