నిధుల మాయాజాలం, శంకర్ పల్లి ఎం ఈ ఓ కార్యాలయానికి తాళం

జ్ఞానతెలంగాణ, శంకర్‌పల్లి:


రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల ఎంఈఓ అక్బర్‌పై వచ్చిన ఆరోపణలు విద్యా పరిపాలనలో సంచలనం సృష్టిస్తున్నాయి. జన్వాడ పాఠశాలలు, ఎంఆర్సీ నిధుల వినియోగంలో సుమారు రూ.20 లక్షల మేర అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదుపై ఆర్జేడి సోమిరెడ్డి సడన్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించారు.
దర్యాప్తు సందర్భంగా ఎంఈఓ కార్యాలయం పని వేళల్లోనే తాళం వేసి ఉండటం తీవ్ర విమర్శలకు దారి తీసింది. అదేవిధంగా సిబ్బంది విధులకు గైర్హాజరు కావడం, సరైన వివరణ ఇవ్వలేకపోవడం పరిపాలనా క్రమశిక్షణలో లోపాలను బహిర్గతం చేసింది. ఎంఈఓ సెలవులో ఉన్నట్లు సమాచారం ఇచ్చినప్పటికీ, లిఖితపూర్వక సమాచారం లేకపోవడం అనుమానాలను మరింత పెంచింది.
ఈ పరిస్థితిపై ఆర్జేడి కఠినంగా స్పందిస్తూ, గైర్హాజరు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారికి సిఫారసు చేశారు. అలాగే ఎంఈఓకు సంబంధించిన పెన్షన్ ప్రక్రియను విచారణ పూర్తయ్యే వరకు నిలిపివేయాలని సూచించారు.
ఈ ఘటన విద్యా పరిపాలనలో పారదర్శకత, బాధ్యతపై ప్రశ్నలను లేవనెత్తుతూ, కఠిన చర్యల దిశగా దర్యాప్తు కొనసాగుతోంది.

You may also like...

Translate »