స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెకానిక్ శిక్షణ

- 27 జనవరి నుంచి హైదరాబాద్ చాప్టర్‌లో ప్రారంభం
- తెలంగాణ యువతకు రెండు నెలల ఉచిత శిక్షణ
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్:1 స్వర్ణ భారత్ ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఉచిత ద్విచక్ర వాహనాల టెక్నీషియన్ / ఆటో సర్వీస్ శిక్షణ కోర్సు నిర్వహించనున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం 27 జనవరి 2026 నుంచి ప్రారంభం కానుంది.
ఈ కోర్సు ద్వారా యువతకు బైక్ మెకానిక్, ఆటో సర్వీస్ టెక్నీషియన్ రంగాల్లో ప్రాక్టికల్ నైపుణ్యాలు అందించి, శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.
ఈ శిక్షణకు 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన తెలంగాణ రాష్ట్ర యువత మాత్రమే అర్హులని పేర్కొన్నారు.
కోర్సు వ్యవధి రెండు నెలలుగా ఉండగా, శిక్షణ పొందుతున్న వారికి ఉచిత భోజనం, వసతి, శిక్షణ, ఉద్యోగ సహాయం, సర్టిఫికెట్‌తో పాటు టూల్ కిట్ అందజేయనున్నట్లు తెలిపారు.
అర్హత కలిగిన అభ్యర్థులు ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు, మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, రేషన్ కార్డు (ఉంటే)తో నమోదు చేసుకోవాలని సూచించారు.
ఈ శిక్షణ కార్యక్రమం రంగారెడ్డి జిల్లా, షాంషాబాద్ మండలం, ముచింతల్‌లోని స్వర్ణభారత్ ట్రస్ట్ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
వివరాల కోసం 99632 77544 నంబర్‌ను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.
