మిషన్ భగీరథ నీళ్లు రాక గ్రామస్తుల ఆందోళన

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: కౌటాల మండలం వీరవెల్లి గ్రామంలో గత కొన్ని నెలల నుండి మిషన్ భగీరథ నీళ్లు రాక గ్రామప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఉండే చేతి పంపుల దగ్గర గంటల తరబడి వరుసలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కూలీ, నాలి చేసుకుంటు బ్రతికే గ్రామ ప్రజలు బుక్కెడంత నీళ్ల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి వీరవెల్లి గ్రామపంచాయతీలో చోటుచేసుకుంది.ఈ సమస్య పై జిల్లా కలెక్టర్, మండల అధికారులు,మరియు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని, బీఆర్ఎస్ పార్టీ కౌటాల మండలం యూత్ ఉపాధ్యక్షులు చునార్ కార్ దిలీప్ కోరారు.

You may also like...

Translate »