సరస్వతి పూజలలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

జ్ఞాన తెలంగాణ,పటాన్ చెరు, జనవరి 24 :
వసంత పంచమి పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని అంబేద్కర్ భవన్ లో బెంగాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సరస్వతి దేవి పూజ కార్యక్రమంలో పటాన్ చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకర్షించాయి. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు షకీల్, రామ్మోహన్, ఉత్సవ కమిటీ సభ్యులు రవి, చటర్జీ, మండల్, తదితరులు పాల్గొన్నారు.
