యువత రాజకీయాల్లోకి రావాలి!

- వారసత్వ రాజకీయాలకు ముగింపు పలుకుదాం
- భారతదేశం యువతతో నిండి ఉంది
- ప్రజాసేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి రండి
- తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సామాజిక కార్యకర్త వీరమళ్ళ లోకేష్ గౌడ్
మార్రిగూడ జ్ఞాన తెలంగాణ అక్టోబర్ 03 :
మునుగోడు నియోజకవర్గ ప్రతినిధి: అక్టోబర్ 3:భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం.. ఇది ఎప్పటి నుంచో చదువుతున్నదే. మనం చెపుతునదే ! వింటునదే ప్రపంచ దేశాలతో ఎన్నో విషయాల్లో పోటీ పడుతున్న భారత్ అభివృద్ధి చెందిన దేశం అని ఎప్పుడు అనిపించుకుంటుందోనని చాలా మంది ఎదురుచూస్తున్నారు. అంతరిక్షం, క్రీడలు, ఇతర విషయాల్లో భారత్ మిగతా దేశాల కంటే మెరుగైనప్రతిభను కనబరుస్తుంది. కానీ మానవ వనరుల అభివృద్ధి విషయంలో రోజురోజుకు క్షీణిస్తుంది. ఇది గ్రహించిన చాలా మంది తమ భవిష్యత్ కోసం దేశాన్ని విడిచి వెళుతన్నారు.ఉన్నత చదువులకోసమని విదేశాలకు వెళ్తున్న యువత అక్కడే స్థిరపడి ఇక్కడి నుంచి తమ కుటుంబాన్ని తీసుకెళ్లి విదేశీ పౌరులుగా మారుతున్నారు. ప్రస్తుతం పలు దేశాల్లో భారత్ సంతతికి చెందిన పౌరులే మంచి స్థాయిలో ఉన్నారు. మున్ముందు మరింత మంది ఇలాంటి వారు కనిపిస్తారు అనుకోవడం లొ ఆశ్చర్యం ఏమీ లేదు. అయితే భారత్ నుంచి ఇలాంటి నైపుణ్యం ఉన్నవారు
రాజకీయాలకూ అవసరమే.
స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో యువత ఉత్సాహంగా రాజకీయాల్లోకి ప్రవేశించింది. ఆ పోకడ 2,3 దశాబ్దాలు కొనసాగింది. దీంతో అప్పుడు యువత రాజకీయాల్లో లేరనే భావనే కలగలేదు. సరళీకరణల తర్వాత రాజకీయాల్లో యువత ప్రాబల్యం గణనీయంగా తగ్గిపోయింది. నేతల గెలుపోటముల్ని డిసైడ్ చేసే స్థితిలో ఉన్న యువత.. నాయకత్వ స్థానాలకు మాత్రం ఎదగలేకపోతోంది. రాజకీయాలపై యువతకు ఆసక్తి లేకపోవడం దీనికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. లిక్కర్ బిజినెస్ చేసేవాళ్లు, రౌడీలు, కబ్జాకోరులే రాజకీయం చేయగలరనే భావన యువతను ముందే కట్టడి చేస్తోంది. ఇప్పటికీ యువత రిస్క్ చేస్తే రాజకీయాల్లో ఓ స్థాయి వరకూ ఎదగొచ్చు. కానీ అంతకుమించి ఎదగటం సాధ్యం కాదు. ఎందుకంటే నేతలు అలా ఎదగనివ్వరు. ఇతర రంగాల్లో ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితులుండగా.. రిస్క్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చి పరిస్థితులతో రాజీపడాల్సిన కర్మేంటని యువతరం ప్రశ్నించుకుంటోంది. దీంతో రాజకీయాలంటేనే మైలు దూరం పరిగెడుతోంది.యువత కి రాజకీయాలపై విముఖత కలగటానికి విద్యావ్యవస్థ కూడా ఓ కారణం అని చెప్పక తప్పదు. గతంలో ఇంటర్ స్థాయి నుంచీ పీజీ వరకు విద్యార్థి సంఘాలు చాలా చురుగ్గా, శక్తివంతంగా ఉండేవి, నిర్ణీత కాలవ్యవధిలో జరిగే విద్యార్థి సంఘాల ఎన్నికలు యువ నేతలను తయారుచేసేవి. కానీ ఇప్పుడు విద్యావ్యవస్థలో. విద్యార్థి సంఘాల ప్రాధాన్యత చాలా వరకు తగ్గిపోయిందని దీనితో యువతకి రాజకీయాలపై ఆసక్తి లేకుండా పోతుంది. అసలు విద్యార్థి సంఘాలు ఉంటాయని కూడా తెలియని తరం ప్రస్తుతం ఉంది .చదువు పూర్తిచేసుకుని సమాజంలో అడుగుపెడుతోంది. దీంతో వీరికి అకడమిక్ నాలెడ్జ్ మినహా మిగతా దేని గురించీ అవగాహన ఉండే అవకాశం ఉండటం లేదు. చదువుకునేటప్పుడు అకడమిక్ నాలెడ్జ్, ఉద్యోగాల కోసం స్కిల్ డెవలప్ మెంట్. అంతే కదా కావాల్సింది. ఇక మిగతా నాలెడ్జ్ కోసం సమయం వృధా చేయడం..బ్రైన్ వేస్ట్ అనేది ప్రస్తుత యువత ఆలోచన ఉందని అభిప్రాయం. బాగా చదివితే కచ్చితంగా గోల్డ్ మెడల్ వస్తుంది. ఇంటర్వ్యూలో బాగా పర్ఫార్మ్ చేస్తే.. కచ్చితంగా లక్షల రూపాయల జీతంతో కొలువు ఖాయం. అది వచ్చాక జీవితంలో స్థిరపడిపోవచ్చు. ఇంత గ్యారంటీ జీవితాన్ని కళ్లెదురుగా పెట్టుకుని.. ఎంత కష్టపడ్డా.. ఏం చేసినా ఎదుగుతామనే నమ్మకం లేని రాజకీయాల్లోకి ఎందుకు రావాలని యువత ఆలోచించడమే పెద్ద సమస్య అనడంలో మరో మాటకు తావు లేదు. ఇవి కాకుండా యువత రాజకీయాల్లోకి వచ్చి సమాజ మార్పుతో పాటు రాజకీయంలో మార్పులు తీసుకురావాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సామాజిక కార్యకర్త వీరమళ్ళ లోకేష్ గౌడ్ అన్నారు.