టాటా ఎఐఎ లైఫ్ ఇన్సూరెన్స్: నామినీకి రూ. 6 లక్షల క్లెయిమ్ చెక్కు అందజేసిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్, ఏప్రిల్ 21, 2025:
టాటా ఎఐఎ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా రాజుర తాలూకా ముండి గేట్ గ్రామానికి చెందిన దివంగత భానోత్ కిషన్ గారి భార్య నామినీ భానోతు జ్యోతికి రూ. 6 లక్షల క్లెయిమ్ చెక్కును హైదరాబాద్‌లో నిర్వహించిన ఏజెంట్ల సమావేశంలో మాజీ సీనియర్ ఐపీఎస్ అధికారి డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి ద్వారా నామినీకి అందించారు.
భానోత్ కిషన్ గారు కాగజ్‌నగర్‌కు చెందిన ఏజెంట్ గుగులోత్ రజిత ద్వారా జనవరి నెలలో టాటా ఎఐఎ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్నారు.
సంవత్సరానికి రూ. 50,000 చెల్లించే ఈ పాలసీ కింద ఒక కిస్తు చెల్లించిన కొన్ని నెలలకే, హార్ట్ ఎటాక్ కారణంగా ఆయన అకాల మరణం చెందారు.
సమావేశంలో మాట్లాడుతూ, డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ జీవిత బీమా యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేశారు. “ప్రతి ఒక్కరూ టర్మ్ పాలసీ తీసుకొని తమ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలి. ఇన్సూరెన్స్ ద్వారా కుటుంబాలకు ఆర్థిక భరోసా అందించడం మన లక్ష్యం,” అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ శ్యామ్ రావు, మేనేజర్ నున్న మురళి, సీనియర్ బిజినెస్ అసోసియేట్ కందికంటి విజయ్ కుమార్, చీఫ్ బిజినెస్ అసోసియేట్ శ్రీధర్ మాల్యల, బిజినెస్ అసోసియేట్ లీడర్లు ఎర్రమంజుల మహేష్, కొంగరి అరుణ, కొంకటి శేఖర్, బోనగిరి ప్రభాకర్, యాపచెట్టు యాదగిరి, ఏజెంట్ గుగులోత్ రజిత, రాజేందర్ గారు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం టాటా ఎఐఎ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క నిబద్ధతను మరియు త్వరగా క్లెయిమ్ సెటిల్మెంట్లో సేవలను ప్రదర్శించింది, కుటుంబాలకు ఆర్థిక స్థిరత్వం అందించే లక్ష్యాన్ని బలపరుస్తుందని కందికంటి విజయ్ కుమార్ తెలిపారు.