రోడ్డు మరమ్మత్తు పనులు వేగంగా చేపట్టాలి

రోడ్డు మరమ్మత్తు పనులు వేగంగా చేపట్టాలి

  • సిపిఐ(ఎం)డిమాండ్

జ్ఞాన తెలంగాణ, నల్లగొండ జిల్లా ప్రతినిది, డిసెంబర్ 30 :

ఈరోజు సిపిఐ(ఎం)పార్టీ ఎల్లారెడ్డిగూడెం శాఖ ఆధ్వర్యంలో సర్వీస్ రోడ్డు పనులు పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ కుమ్మరి శంకర్ మాట్లాడుతూ గత మూడునెలల క్రితం సర్వీస్ రోడ్డు పనులు మొదలుపెట్టడం జరిగింది ఈ పనుల పేరుతో అక్కడ ఉన్న వాటర్ లైన్ గాని, డ్రైనేజీ గాని పూర్తిగా తొలగించడం జరిగింది. పనులు మాత్రం నత్తనడక నడుస్తున్నాయి పైప్ లైన్ దెబ్బతినడంతో ఇక్కడ ఉన్న ఇందిమ్మ కాలనీవాసులకు నీళ్లు సరఫరగాక నాన్న ఇబ్బందులకు గురవుతున్నారు కాలనీవాసులు సొంత డబ్బులతో నీళ్లు కొనుకోచ్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది దీనికి సంబంధించి కాంట్రాక్టు నీళ్లు సరఫరా చేయవలసి ఉన్నప్పటికీ పట్టించుకునే పరిస్థితి లేదు డ్రైనేజీనీళ్లు రోడ్డు మీద జామై దోమలు, పురుగులు,ఈగలు రావడంతో కాలనీ వాసులకు నాన్న ఇబ్బందులకు గురవుతున్నారు తక్షణమే కాంట్రాక్టు, గ్రామపంచాయతీ కార్యదర్శి స్పందించి సర్వీస్ రోడ్డు,డ్రైనేజీ,వాటర్ లైన్ తొందరగా పూర్తి చేయాలని మాజీ ఎంపీటీసీ కుమ్మరి శంకర్ ప్రభుత్వ డిమాండ్ చేశారు. లేనియెడల గ్రామ ప్రజలతో సిపిఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కమిటీ సభ్యులు దండు రవి, శాఖ కార్యదర్శిలు దండు నాగరాజు, దండు శ్రీను, అంతటి సత్యనారాయణ, వడ్డేపల్లి యాదయ్య, దండు శంకర్, పట్ల ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »