ఏపీ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తుల నియామకం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులను కేంద్ర ప్రభుత్వం నియమించింది. గంధం సునీత, ఆలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తంలను రెండేళ్ల కాలపరిమితితో అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నియామకాలకు సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు....