జ్ఞానతెలంగాణ,పెబ్బేర్: పెబ్బేరు మున్సిపాలిటీ కేంద్రంలో వనపర్తి వెళ్ళు రహదారిలో వెలిసిన చౌడేశ్వరిదేవి అమ్మవారి జయంతి వేడుకలను గురువారం ఆషాడం అమావాస్య కావడంతో వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ నిర్వహకులు చౌడేశ్వరిదేవి ఆలయాన్ని విద్యుత్ దీపాలంరణాలో ఉంచి పూజలు చేశారు అమ్మవారికి అభిషేకం,కుంకుమార్చన, మంగళహారతి నిర్వహించారు.అమ్మవారికి భక్తులు ఇండ్ల వద్ద నుంచి జిల్లెడు పూల హారాని మంగళ వాయిద్యాలతో తెచ్చి అమ్మవారికి అలంకరించారు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించి ముక్కులు తీసుకున్నారు అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.