కేంద్ర మంత్రిని కలిసిన ఆలయ కమిటీ సభ్యులు

జ్ఞాన తెలంగాణ,ఎల్లారెడ్డిపేట మండలం,ఆగస్టు 18 : దుమాల దేవాలయ కమిటీ సభ్యులు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం శిథిలావస్థకు చేరుకోగా గ్రామస్థులు ఆలయ కమిటీ సభ్యులు పునః నిర్మాణం చేపట్టారు. అందులో భాగంగా ప్రహరి గోడ నిర్మాణానికి మరియు బోరు మోటారు గురించి నిధులు మంజూరు చేయాలని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రం జిల్లా కార్యదర్శి మద్దుల బుగ్గారెడ్డి, బిజెవైయం జిల్లా ప్రధాన కార్యదర్శి మానుక కుమార్ యాదవ్ మరియు దేవాలయ కమిటీ చైర్మన్ ఉల్లి బాలయ్య మరియు టెంపుల్ పాలకవర్గం కొలనురు శంకర్, గుల్లపల్లి సత్యనారాయణ రెడ్డి, ధర్మారపు రవి, అంకం వెంకటేష్, కదిరే శ్రీనివాస్, నిమ్మల బాలరాజ్ తదితరులు పాల్గొనడం జరిగింది
