– ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో జరిగే మహా ప్రదర్శన కార్యక్రమం విజయవంతం కై కదం తొక్కిన ఎమ్మార్పీఎస్ నాయకులు – లక్ష డబ్బులు వెయ్యి గొంతుల వాల్ పోస్టర్ ఆవిష్కరించిన మునిపల్లి మండల నాయకులు
జ్ఞాన తెలంగాణ, ఫిబ్రవరి 3, మునిపల్లి మండలం, సంగారెడ్డి జిల్లా: మండల పరిధిలో లక్ష డబ్బులు వెయ్యి గొంతుల కార్యక్రమంలో భాగంగా నేడు మునిపల్లి మండల ఎమ్మార్పీఎస్ కమిటీ ఆధ్వర్యంలో బుదేరా చౌరస్తా మార్కెట్ ప్రాంతంలో భారీ ప్రదర్శనతో చలో హైదరాబాద్ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన నాయకులు మరియు ఇబ్రహీంపూర్, ముదిర గ్రామం,బుదేరా ఎక్స్ రోడ్,పెద్ద గోపులారం, గ్రామాలలో ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహిస్తూ మాదిగలు పెద్ద ఎత్తున ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో జరిగే మహా ప్రదర్శనకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ఎమ్మార్పీఎస్ నాయకులు మరియు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.