నూతనంగా ఎన్నికైన సిడిసి చైర్మన్ మహ్మద్ అబ్దుల్ ముబీన్ ను సన్మానించిన

సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి మరియు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి
జ్ఞాన తెలంగాణ జహీరాబాద్ ప్రతినిధి అక్టోబర్ 3 :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చక్కెర & చెరుకు కమిషనర్ జహీరాబాద్ సిడిసి చైర్మన్ గా గోదావరి గంగా ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ షుగర్ కంపెనీ అనుసంధానం గా సిడిసి చైర్మన్ గా మొగడంపల్లీ మండలం అసద్ గంజ్ గ్రామానికి చెందిన మహ్మద్ అబ్దుల్ ముబీన్ మరియు,డైరెక్టర్లుగా మల్లారెడ్డి,చందర్ నాయక్, వెంకటేష్ గోయల్,రవీంద్ర రెడ్డి నియమించారు.ఈసందర్భంగా శుక్రవారం రోజు జహీరాబాద్ పట్టణంలో ఆదర్శనగర్ కాలనీ గెస్ట్ హౌస్ లో సిడిసి చైర్మన్,డైరెక్టర్లను తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి ,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి ఘనంగా సన్మానించి వారికి శుభాకాంక్షలు తెలిపారు.ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి మరియు నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.