ఆత్మైస్థెర్యానికి కరాటే ముఖ్యం : చేవెళ్ల ఎమ్మెల్యే “కాలే యాదయ్య”

శంకర్ పల్లి మండలం మొకిల గ్రామంలోని పట్లోల్ల రవీందర్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో (11Th స్టేట్ లెవల్) సక్సెస్ షోటో కాన్ కరాటే డు-ఇండియా ఛాంపియన్షిప్-2025 ఆద్వర్యంలో నిర్వహించిన ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా హాజరై, పోటీలను ప్రారంభించిన చేవెళ్ల శాసనసభ్యులు “కాలే యాదయ్య” గారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ… కరాటే ఆత్మైస్థెర్యానికి, మనోధైర్యానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నేటి సమాజంలో ప్రతిఒక్కరూ ఆత్మైస్థెర్యంతో తమను తాము కాపాడుకోవడానికి కరాటే ఉపయోగపడుతుందని తెలిపారు.అనంతరం విజేతలకు మెడల్స్ మరియు సర్టిఫికెట్స్ ను అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కరాటే మాస్టర్లు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.




