నూతనంగా ఎన్నికైన యూత్ కాంగ్రెస్ అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలియజేసిన చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి

నూతనంగా ఎన్నికైన యూత్ కాంగ్రెస్ అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలియజేసిన

చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి


  • చేవెళ్ల నియోజకవర్గం- మోత్కుపల్లి మహిపాల్ యాదవ్
  • మండలాల వారిగా
  • శంకర్ పల్లి-బొల్లారం ప్రశాంత్ రెడ్డి
  • చేవెళ్ల-: కార్తీక్ రెడ్డి
  • షాబాద్-సురేందర్
  • నవబ్ పేట్-శేఖర్
  • మొయినాబాద్-విగ్నేష్ రెడ్డి

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా నిర్వహించిన యూత్ కాంగ్రెస్ ఎన్నికలలో విజయ సాధించిన చేవెళ్ల నియోజకవర్గంలోని ఐదు మండలాల నూతన యూత్ కాంగ్రెస్ అధ్యక్షులకు మరియు చేవెళ్ల నియోజకవర్గం లోని ఐదు మండలాలను కలుపుకొని కాంగ్రెస్ యూత్ అధ్యక్షులుగా ఎన్నికైన కొండకల్ గ్రామానికి చెందిన మోత్కుపల్లి మహిపాల్ యాదవ్ కు చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులుగా మోత్కుపల్లి మహిపాల్ యాదవ్ విజయం సాధించగా, మండలాల వారిగా శంకర్ పల్లి- బొల్లారం ప్రశాంత్ రెడ్డి, చేవెళ్ల – కార్తీక్ రెడ్డి, షాబాద్ – సురేందర్, నవాబ్ పేట – శేఖర్, మొయినాబాద్ – విగ్నేష్ రెడ్డి లు భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీని బలోపేతం చేయడానికి కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన చేవెళ్ల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోత్కు పల్లి మహిపాల్ యాదవ్, మరియు మండలాల వారీగా విజయం సాధించిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తూ అవి లబ్ధిదారులకు నేరుగా అందేలా చూడాలని, ప్రజల పక్షాన నిలబడడానికి ఎల్లప్పుడూ కృషి చేయాలని సూచించారు..ఈ కార్యక్రమంలో చేవెళ్ల నియోజకవర్గ అసెంబ్లీ ఇంచార్జ్ పామెన భీమ్ భరత్ , మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెంటారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »