చేవెళ్ల పార్లమెంట్ ప్రజలకు క్రోదీ నామ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు

చేవెళ్ల పార్లమెంట్ ప్రజలకు క్రోదీ నామ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు

  • చేవెళ్ల పార్లమెంట్ లోని ప్రజలు అందరు సుఖసంతోషాలతో ఉండాలని చిల్కూర్ బాలాజిని వేడుకున్న గడ్డం రంజిత్ రెడ్డి మరియు పామేనా భీమ్ భరత్

జ్ఞాన తెలంగాణ, మొయినాబాద్ ఏప్రిల్ 9:

ఉగాది పర్వదిన సందర్భంగా చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కు విచ్చేసిన సందర్భంగా స్వాగతం పలికి ఉగాది శుభాకాంక్షలు తెలిపిన చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ పామేన భీమ్ భరత్.ఆయన ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు,అనంతరం భీమ్ భరత్ చేవెళ్ళ నియోజక వర్గ ప్రజలనుఉద్దేశించి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజలకు శుభం కలగాలని ఆకాంక్షించారు. కాలం కలిసి రావాలని, సమృద్ధిగా వానలు కురిసి, రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని అభిలషించారు.మన సంస్కృతి, సాంప్రదాయం చాటిచెప్పేలా ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాలని చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి మరియు భీమ్ భరత్ కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో
గౌరి సతీష్ (రాష్ట్ర అధికార ప్రతినిధి),షాబాద్ దర్శన్ (ఎస్ సి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు,
మండల అధ్యక్షులు తమ్మలి మాణయ్య,చంద్రారెడ్డి (పి ఏ సి ఎస్ చైర్మన్)సీనియర్ నాయకులు చిలుకూరు మాజీ సర్పంచ్ భద్రప్ప, బాకారం మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి , మండల ఉపాధ్యక్షులు మర్రి రవీందర్ రెడ్డి,సీనియర్ నాయకులు బాలకృష్ణ , హిమాయత్ నగర్ గ్రామ అధ్యక్షులు రమేష్ ముదిరాజ్, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లేష్ యాదవ్ మాజీ సర్పంచ్, హిమాయత్ నగర్ షాబాద్ దాస్ శేఖర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నవీన్,పూడూర్ రాజు, సంగం రాజు, బైకని కుమార్ యాదవ్ మరియు తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »